ఆపరేషన్‌ థియేటర్‌లో నర్సును ముద్దాడిన వైద్యుడు: వీడియో

Mon,January 14, 2019 08:08 AM

ఉజ్జయిని(మధ్యప్రదేశ్): ప్రభుత్వ సివిల్ సర్జన్(49ఏళ్లు) ఒకరు ఆపరేషన్ థియేటర్‌లో ఓ మహిళను ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఆస్పత్రిలో జరిగింది. వీడియో కాస్త ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా హాస్పిటల్‌లో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న సదరు వైద్యుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శశాంక్ మిశ్రా మీడియాకు తెలిపారు. అతడి చర్యపై వివరణ కోరుతూ సీనియర్ వైద్యులు నోటీసులు కూడా జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు.


ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలనుకుంటున్నట్లు డీసీఎంహెచ్‌వో డాక్టర్ మోహన్ మాలవీయా వెల్లడించారు. ఆస్ప‌త్రి థియేట‌ర్‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంద‌న్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సదరు సర్జన్ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో ముద్దుపెట్టుకుంటున్నట్లుగా ఉన్న ఆ మహిళ అదే హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సు అని వీడియోను పరిశీలిస్తే తెలుస్తోంది.