వర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌లో జంక్‌ఫుడ్స్ వద్దు..

Wed,August 22, 2018 04:14 PM

UGC Directs varsities, colleges TO ban on junk foods

న్యూఢిల్లీ: యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌లలో జంక్ ఫుడ్స్ అమ్మవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది. మంచి ఆహారంతో విద్యార్థుల్లో స్థూలకాయం స్థాయిని తగ్గించి, ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు, బరువు పెరగడం వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధులను నిరోధించవచ్చని..ఈ మేరకు జంక్ ఫుడ్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు యూజీసీ నిర్దేశించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు జంక్‌ఫుడ్స్‌ను నిషేధిస్తూ సర్క్యులర్ జారీచేసినట్లు యూజీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

1017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles