దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి: మోదీ

Sat,March 17, 2018 08:46 PM

Ugadi is the festival of beginning of human civilisation says pm modi

న్యూఢిల్లీ: దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం త్రివేణి సంగమ క్షేత్రమని మోదీ తెలిపారు. శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దేశ ప్రజలకు సందేశమిచ్చారు. బసవేశ్వరుడు నడయాడిన క్షేత్రం శ్రీశైలమని ప్రధాని అన్నారు. భారతదేశంలోనే శ్రీశైలం ఒక దివ్యక్షేత్రమన్నారు. ఉగాది యుగానికి ఆరంభమన్న మోదీ... సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో ఉగాదిని ప్రారంభించాలన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఉగాదిని పవిత్రంగా జరుపుకుంటారన్న మోదీ.. ఉగాది పర్వదినాన కొత్త ఇండ్ల నిర్మాణం, వాహనాల కొనుగోళ్లు లాంటి కార్యక్రమాలను చేపడతారని తెలిపారు. దేశ ప్రజలంతా రేపు ఉగాది పచ్చడిని ఆస్వాదించాలన్నారు. శ్రీశైలం జనజాగృతి సమ్మేళనం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారని మోదీ తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ సమ్మేళనమే నిదర్శనమని ప్రధాని చెప్పారు.

4108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles