బీజేపీలో చేరిన ఎన్‌సీపీ ఎంపీ

Sat,September 14, 2019 11:23 AM

Udayanraje Bhosale, NCP MP and Shivaji descendant, joins BJP ahead of Maharashtra polls

న్యూఢిల్లీ: ఛత్రపతి శివాజీ వంశస్థుడు, ఎన్‌సీపీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తాను బీజేపీలో చేరబోతున్నానని, ఎన్‌సీపీ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు భోసలే శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నాని.. ఇప్పటి నుంచి బీజేపీ నేతగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటించారు. అంతకుముందు భోసలే..ఫడణవీస్‌తో కలసి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్‌సీపీకి రాజీనామా చేయడానికి ముందు ఆయన గురువారం ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి భోసలే ఎన్‌సీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతలను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles