టైర్ల‌ను కుర్చీలుగా వాడారు.. అందుకే కోచింగ్ సెంట‌ర్‌లో మంట‌లు

Mon,May 27, 2019 12:44 PM

Tyres used as chairs in coaching class made fire spread fast, says Gujarat Chief Secretary

హైద‌రాబాద్: సూర‌త్‌లోని కోచింగ్ సెంట‌ర్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 22 మంది విద్యార్థులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే కోచింగ్ సెంట‌ర్ యాజ‌మాన్యం.. విద్యార్థుల కోసం కుర్చీల స్థానంలో టైర్ల‌ను వాడ‌డం వ‌ల్ల అగ్నిప్ర‌మాదం జ‌రిగినట్లు ప్ర‌భుత్వ అధికారులు తేల్చారు. ఫ్లెక్సీలు, టైర్లతో పాటు మంట‌ల‌కు తొంద‌ర‌గా కాలిపోయే ప‌దార్ధాలు ఉండ‌డం వ‌ల్ల ప్ర‌మాదం అదుపు చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ జేఎన్ సింగ్ తెలిపారు. కోచింగ్ ఇన్స్‌టిట్యూట్ కేవ‌లం అయిదు ఫీట్ల ఎత్తు ఉన్న కార‌ణంగా.. యాజ‌మాన్యం విద్యార్థుల కోసం కుర్చీలు వేయ‌లేద‌ని, వాటి స్థానంలో టైర్ల‌ను ఏర్పాటు చేశార‌ని, అయితే అగ్నిప్ర‌మాదం స‌మ‌యంలో ఆ టైర్లు శ‌ర‌వేగంగా అంటుకున్నాయ‌ని అధికారులు చెప్పారు. అగ్నిమాప‌క యంత్రాలు రావ‌డానికి 45 నిమిషాలు ప‌ట్టింద‌ని, దాని వ‌ల్ల మంట‌ల్ని అదుపు చేయ‌డం ఆల‌స్యమైంద‌న్నారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles