త్రాల్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Tue,March 5, 2019 11:05 AM

Two terrorists killed in the ongoing encounter between security forces and terrorists in Tral.

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టిన బలగాలు ఉగ్రవాదులను ఏరివేసేందుకు నిన్నటి నుంచి ముమ్మర గాలింపు చేపట్టారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు జనవాసాల్లో నక్కి కాల్పులు జరుపుతుండడంతో భద్రతా దళాలు ఆచితూచి వ్యవహరించాయి. ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.1242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles