అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

Thu,June 13, 2019 10:26 AM

Two Sisters GangRaped By Four At Gunpoint In Uttar Pradesh

లక్నో : అభం శుభం తెలియని ఇద్దరు మైనర్లపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌ జిల్లాలోని కశీర్వా గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పొలం వద్ద వెళ్లి తల్లి కోసం ఎదురుచూస్తున్నారు. అటుగా వచ్చిన నలుగురు దుండగులు.. మైనర్లను చూసి ఆగిపోయారు. తుపాకీతో బెదిరించి అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామానికి చేరుకున్న మైనర్లు.. జరిగిన విషయాన్ని గ్రామస్థులకు చెప్పారు. మొత్తానికి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం నుంచి యూపీలో చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

6144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles