ఐసిస్ చెరనుంచి తెలుగు ఇంజినీర్లు విడుదల

Thu,September 15, 2016 10:42 AM

Two men released who were captive in Libya

ఢిల్లీ: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు ఇంజినీర్లు బలరామ్ కృష్ణ(తెలంగాణ), గోపీకృష్ణ(ఏపీ)లకు విముక్తి లభించింది. 29 జూలై, 2015న ఉగ్రవాదులు వీరిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తమవారి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ నిర్విరామ కృషితో ఉగ్రవాదుల చెరనుంచి బాధితులు విడుదలయ్యారు. ఇరువురి విడుదలను విదేశీ వ్యవహారాలశాఖ నిర్ధారించింది. కాగా తెలుగు ఇంజినీర్ల విడుదలపై హర్షం వ్యక్తంచేస్తూ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.


1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles