రెండు వ‌ర్గాలుగా చీలి.. కొట్టుకున్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు

Tue,January 29, 2019 02:42 PM

Two groups of Congress workers clash during the partys district meeting in Jalore

జాలోర్: రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు కొట్టుకున్నారు. రెండు వ‌ర్గాలుగా మారిన పార్టీ మ‌ద్ద‌తుదారులు తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. గ్యాంగ్‌వార్‌ను త‌ల‌పించే రీతిలో రెండు వ‌ర్గాలు భీక‌రంగా ముష్టియుద్ధానికి దిగాయి. జాలోర్‌లో జ‌రిగిన జిల్లా స్థాయి పార్టీ మీటింగ్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇంచార్జ్ భ‌న్స‌ల్ మీటింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అక్క‌డ కార్య‌క‌ర్త‌లు కుమ్ములాట‌కు దిగారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జాలోర్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ ఓడింది. అయితే వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గెలుపు సాధించాల‌న్న ల‌క్ష్యంతో అక్క‌డ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. దీంతో వ‌ర్క‌ర్ల మ‌ధ్య పంచ్‌లు స్టార్ట్ అయ్యాయి. వారిని ఆపేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా ఎవ‌రూ విన‌లేదు.2063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles