స్కూల్ బస్సులోకి చొరబడి ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

Tue,February 12, 2019 06:10 PM

Two children kidnapped from school bus in Mp

మధ్యప్రదేశ్ : ఓ వ్యాపారవేత్త కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో వెలుగుచూసింది. చిన్నారులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సులోకి కొందరు దుండగులు చొరబడ్డారు. బస్సులో ఉన్నవారిని గన్ తో బెదిరించి ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లారు. దుండగులు ముసుగుతో లోపలికి వచ్చినట్లు బస్సులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిన్నారుల కిడ్నాప్ విషయంపై అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామని, త్వరలో ఇద్దరు చిన్నారులను సురక్షితంగా కాపాడుతామని చిత్రకూట్ ఏఎస్పీ గౌతమ్ సోలంకి వెల్లడించారు.


2529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles