యూపీలో ఇద్ద‌రు జైషే అనుచ‌రులు అరెస్టు

Fri,February 22, 2019 03:33 PM

Two alleged operatives of JeM held in Deoband, Uttar Pradesh


ష‌హ‌రాన్‌పూర్ : జైషే మ‌హ్మ‌ద్‌కు చెందిన ఇద్ద‌రు అనుచ‌రుల‌ను ఇవాళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ష‌హ‌రాన్‌పూర్‌లోని దియోబంద్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్ ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిని ష‌హ‌న‌వాజ్ తెలి, అకిబ్ అహ్మ‌ద్ మాలిక్‌గా గుర్తించారు. తెలిది కుల్గామ్ జిల్లా. మాలిక్‌ది పుల్వామా జిల్లా. దియోబంద్‌లోని ఓ విద్యార్థి ఇచ్చిన స‌మాచారం మేర‌కు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్ద‌రి నుంచి రెండు 32 బోర్ పిస్తోళ్లు, 30 లైవ్ కాట్రిడ్జ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మొబైల్ ఫోన్ల‌లో జిహాదీ చాట్‌, వీడియో, ఫోటోల‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఇద్ద‌రూ జైషే కోసం కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

1254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles