బెంగ‌ళూరులో రెండు జెట్ విమానాలు ఢీ: వీడియో

Tue,February 19, 2019 12:32 PM

Two aircraft of the Surya Kiran Aerobatics Team crash at the Yelahanka

బెంగళూరు: కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది. ఈ నెల 20న బెంగళూరులో ప్రారంభంకానున్న ఎయిరో ఇండియా ప్ర‌ద‌ర్శ‌న కోసం ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన‌ పైల‌ట్లు రిహార్స‌ల్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 20-24 మధ్య జరగనున్న ప్ర‌ద‌ర్శ‌న‌లో అంత‌ర్జాతీయ విమాన‌యాన సంస్థ‌లు త‌మ అత్యాధునిక ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి.

మంగ‌ళ‌వారం రిహార్స‌ల్స్ చేస్తుండ‌గా సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘ‌ట‌న స‌మ‌యంలో ముగ్గురు పైల‌ట్లు జెట్ విమానాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక పౌరుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.2159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles