నీకు పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఇప్పించాలి.. ముందు నువ్వు క్రికెట్ సంగతి చూసుకో!

Tue,April 2, 2019 04:46 PM

Twitter war spices up between Gautham Gambhir and Omar Abdulla

న్యూఢిల్లీ: ట్విటర్‌లో మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా మధ్య ఆసక్తికరమైన ఫైట్ నడుస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధానమంత్రిని నియమించే దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ మరోసారి ప్రయత్నం చేస్తుందన్న ఒమర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ గంభీర్ ట్వీట్ చేయడంతో వీళ్ల మధ్య గొడవ ప్రారంభమైంది. ఒమర్ కోరిక తనకు సముద్రంపై నడుస్తున్నట్లుగా.. పందులు గాల్లో ఎగురుతున్నట్లుగా అనిపిస్తున్నదని గంభీర్ ఆ ట్వీట్‌లో అభిప్రాయపడ్డాడు. ప్రత్యేక పీఎం సంగతి తర్వాత.. ముందు మంచిగా నిద్రపోయి తర్వాత ఓ స్ట్రాంగ్ కాఫీ తాగు.. అప్పటికీ అలాగే ఉంటే నీకు పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఇప్పించాల్సిందే అని గంభీర్ ట్వీట్ చేశాడు.


దీనికి ఒమర్ కూడా ఘాటుగానే స్పందించాడు. నాకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు. అందుకే దాని గురించి ఏమీ మాట్లాడను. అలాగే నీకు జమ్ముకశ్మీర్ చరిత్ర గురించి ఏమీ తెలియదు. నీకు తెలిసిన విషయంపై మాట్లాడు.. ఆ ఐపీఎల్‌పై ట్వీట్లు చేసుకో అంటూ గంభీర్‌కు సూచించాడు.
అయినా గంభీర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరో ట్వీట్‌తో ఒమర్‌కు పంచ్ ఇచ్చాడు. క్రికెట్ గురించి తెలియకపోతే వచ్చే నష్టం లేదు కానీ.. మీకు నిస్వార్థ రాజకీయం గురించి కాస్తయినా తెలిసి ఉంటే కశ్మీర్‌తోపాటు ఈ దేశం ఎప్పుడో బాగు పడేది అని గౌతీ మరో ట్వీట్ చేశాడు. అయితే దీనికి మాత్రం ఒమర్ ఇంకా సమాధానం ఇవ్వలేదు.

3930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles