ఎన్నికల ఫలితాలపై నెటిజన్ల కామెడీ ట్వీట్లు..ఫ‌న్నీ వీడియోలు

Sat,March 3, 2018 03:47 PM

Twitter reacts to northeast election resultsన్యూఢిల్లీ:ఈశాన్య రాష్ర్టాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని పార్టీలు ఓటింగ్ మొదలైనప్పుడు ఆధిక్యంలో కొనసాగి తరువాత ఢీలా పడ్డాయి. త్రిపురలో బీజేపీ సత్తా చాటింది. కమ్యూనిస్టుల కంచుకోటపై కమలం జెండా వికసించింది. మేఘాలయలో మాత్రం కాంగ్రెస్ మెజారిటీ సీట్లను దక్కించుకున్నప్పటికీ ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూ.. బీజేపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. నాగాలాండ్, త్రిపురలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరోవైపు మేఘాలయలో బీజేపీ కూడా రెండు సీట్లు మాత్రమే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా భాజపా, కాంగ్రెస్, సీపీఎంలతో పాటు ఆయా రాష్ర్టాల ప్రాంతీయ పార్టీలపై నెటిజన్లు త‌మ‌దైన శైలిలో సరదా ట్వీట్లు, సెటైర్లు, కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

3859
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles