మేఘాలయలో థగ్ ఆఫ్ వార్

Sat,March 3, 2018 01:38 PM

షిల్లాంగ్:ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచనాలు నమోదవుతున్నాయి. త్రిపురలో మాణిక్ సర్కార్ సారథ్యంలోని సీపీఎంకు ఎదురుదెబ్బ తగిలింది. కంచుకోటను బద్దలు కొట్టి.. భారీగా పుంజుకున్న బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. మరోవైపు మేఘాలయ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆసక్తికరంగా మారాయి. మేమంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


ఇక్కడ స్పష్టమైన ఆధిక్యం ఎవరికీ రాలేదు. మేఘాలయలో ఇతరుల మద్దతే కీలకంగా మారింది. అయితే ఇక్కడ గత 10ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది. యూడీపీ, ఎన్‌పీపీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ చెప్పారు. వ్యూహాకర్త హిమాంత బిశ్వా శర్మను ఇప్పటికే షిల్లాంగ్‌కు పంపడానికి బీజేపీ సిద్ధంగా ఉండగా.

కాంగ్రెస్ కూడా తమ పార్టీ సీనియర్ నేతలు కమల్‌నాథ్, అహ్మద్‌పటేల్‌ను శనివారం ఉదయమే పంపించింది. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ నేతృత్వంలోని బీజేపీ అధికారం చేపట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన నైపూ రియోను నాగాలాండ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2590
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles