ఎన్ని కుట్రలు చేసినా సత్యం, ధర్మమే గెలుస్తుంది

Wed,April 24, 2019 07:28 PM

Truth and dharma will wins always says Pragya Singh Thakur


భోపాల్ : భోపాల్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రగ్యాసింగ్‌కు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని..మాలేగావ్ పేలుళ్లలో కొడుకును కోల్పోయిన నిసార్ సయ్యద్ అనే వ్యక్తి ఎన్ఐఏ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌పై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నేడు విచారణ చేపట్టింది.

ప్రగ్యాసింగ్‌కు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అధికారం కోర్టుకు లేదని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అధికారం కేవలం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంటుందని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు పట్ల సాధ్వి ప్రగ్యాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉందని, ఎన్ని కుట్రలు చేసినా సత్యం, ధర్మమే గెలుస్తుందని, తాను వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని సాధ్వి ప్రగ్యాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

1656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles