ప్ర‌ధాని వివ‌ర‌ణ ఇవ్వాలి.. కాంగ్రెస్‌ వాకౌట్‌

Wed,July 24, 2019 12:53 PM

Trump mediation on Kashmir, Congress walks out of Lok Sabha

హైద‌రాబాద్‌: క‌శ్మీర్ అంశంపై డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ప్ర‌ధాని మోదీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుప‌ట్టాయి. ప్ర‌భుత్వం స‌మాధానంతో సంతృప్తి చెంద‌ని కాంగ్రెస్ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వం ఉండ‌ద‌ని కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ స్వాభిమానానికి చెందిన అంశంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని స‌హించ‌బోమ‌ని రాజ్‌నాథ్ చెప్పారు. ఒక‌వేళ పాక్‌తో చ‌ర్చ‌లు జ‌రిగితే, కేవ‌లం క‌శ్మీర్ అంశంపైన మాత్ర‌మే కాకుండా, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ గురించి కూడా ప్ర‌స్తావిస్తామ‌న్నారు. సిమ్లా అగ్రిమెంట్‌కు వ్య‌తిరేకంగా ఎటువంటి చ‌ర్య‌లు ఉండ‌వ‌న్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌తో ట్రంప్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయాల‌ని మోదీ త‌న‌ను కోరిన‌ట్లు ట్రంప్ చెప్పారు. దీంతో గ‌త రెండు రోజులుగా పార్ల‌మెంట్‌లో ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతున్న‌ది. ట్రంప్, మోదీ మ‌ధ్య ఏం చ‌ర్చ జ‌రిగిందో అన్న అంశంపై దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతున్న‌ద‌ని, పార్ల‌మెంట్‌కు మోదీ వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అధిర్ రంజ‌న్ డిమాండ్ చేశారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles