
న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి భౌతికకాయానికి టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటు అని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వాజ్‌పేయితో కలిసి పని చేసిన అనుభవం మరువలేనిది. చిన్న రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వాజ్‌పేయి ఎప్పుడూ సానుకూల ఆలోచనతో ఉండేవారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని జితేందర్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు.