ప్రధాని మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

Mon,January 7, 2019 03:33 PM

TRS MPs met Prime Minister Narendra Modi in New Delhi

ఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ లోక్‌స‌భ‌, రాజ్యసభ ఎంపీలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్‌ కార్యాలయానికి భూ కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ, లోక్‌స‌భ‌ టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య 17గా ఉందని తెలిపారు. అర్బన్ డెవలప్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 1000 చదరపు గజాల స్థలం ఇవ్వాలని వివరించారు. రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్‌ పార్టీకి కేటాయించాలని ప్ర‌ధానిని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.

1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles