కేరళ వరద బాధితులకు టీఆర్‌ఎస్ ఎంపీల చేయూత

Sun,August 19, 2018 06:22 PM

TRS MPs donating their one month salary to kerala flood victims

హైదరాబాద్: గత వందేండ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ర్టాన్ని ముంచెత్తాయి. ఆగస్టు 8 నుంచి కేరళ కురుస్తున్న భారీ వర్షాలకు వందల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని రాష్ర్టాలు, కేంద్రం ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కేరళ వరద బాధితులకు రూ.25 కోట్ల సాయం ప్రకటించింది. చాలా మంది వాళ్లకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేరళ వరద బాధితులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకున్నది. నెల వేతనం విరాళంగా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌కు చెందిన 20 మంది ఎంపీలు నిర్ణయించారు. నెల జీతాన్ని సీఎం రిలీఫ్ పండ్‌కు అందించనున్నారు.

5170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS