కూటమిలో కలిసిన చంద్రబాబు.. నేనే నాయకుడిని అనడం సరికాదు!

Wed,January 9, 2019 02:20 PM

TRS MP Vinod Demands Centre Should Approve Telangana Govt Reservation Bill

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో ఏపీ సీఎం చంద్రబాబు జట్టుకట్టారు. కూటమిలో కలిసిన చంద్రబాబు.. నేనే నాయకుడిని అనడం సరికాదు. నేనే కూటమిని ఏర్పాటు చేశానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడని ఎంపీ వినోద్ కుమార్ విమ‌ర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో గిరిజనుల, బీసీల శాతం పెరిగింది. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50శాతం రిజర్వేషన్లు దాటుతున్నాయన్న వంక చూపెట్టారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు పెంపు మంచిదే.. కానీ హడావుడిగా తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణాల్లోనూ రిజర్వేషన్లు ఉండటంతో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లవుతుందని అన్నారు.

2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles