ప‌రిశ్ర‌మ‌ల స్థాయి సంఘం చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు

Sat,September 14, 2019 09:11 AM

TRS MP K Keshava Rao appointed as Committee on Industrys Chairperson

హైద‌రాబాద్‌: లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ శుక్ర‌వారం పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం క‌మిటీల జాబితాను రిలీజ్ చేసింది. 17వ లోక్‌స‌భ‌కు సంబంధించి వివిధ క‌మిటీల‌కు ఎవ‌రెవ‌రు చైర్మ‌న్లుగా, స‌భ్యులుగా ఉన్నారో ఆ జాబితాను అప్‌డేట్ చేశారు. టీఆర్ఎస్ నేత, రాజ్య‌స‌భ ఎంపీ కేశ‌వ‌రావును ప‌రిశ్ర‌మ‌ల క‌మిటీ స్థాయి సంఘం చైర్మ‌న్‌గా నియ‌మించారు. ఈ క‌మిటీలో మొత్తం 21 మంది లోక్‌స‌భ ఎంపీలు, ప‌ది మంది రాజ్య‌స‌భ ఎంపీలు ఉన్నారు. కీల‌క‌మైన ఫైనాన్స్‌, విదేశీ వ్య‌వ‌హారాలు గ‌తంలో కాంగ్రెస్ ఎంపీల ఆధీనంలో ఉండేవి. అయితే ఇప్పుడు ఆ రెండు క‌మిటీల‌కు బీజేపీ ఎంపీలను చైర్మ‌న్లుగా నియ‌మించారు. ఆర్థిక క‌మిటీకి బీజేపీ ఎంపీ జ‌యంత సిన్హా, విదేశీ వ్య‌వ‌హారాల‌కు పీపీ చౌద‌రీలు చైర్మ‌న్లుగా నియ‌మితుల‌య్యారు. ఈ రెండు క‌మిటీల‌కు గ‌తంలో కాంగ్రెస్ ఎంపీలు వీర‌ప్ప మొయిలీ, శ‌శిథ‌రూర్‌లు ఉండేవారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొయిలీ ఓట‌మి పాల‌య్యారు. ఇక శ‌శి థ‌రూర్‌ను ఈసారి ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని.. ర‌క్ష‌ణ‌శాఖ క‌మిటీలో స‌భ్యుడిగా చేశారు. దీనికి జువ‌ల్ ఓర‌మ్ నేతృత్వం వ‌హించ‌నున్నారు.

1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles