శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలి : టీఆర్ఎస్ ఎంపీ

Tue,February 12, 2019 02:35 PM

న్యూఢిల్లీ : ఇటీవల దివంగతుడైన శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. లోక్ సభలో మాట్లాడిన పాటిల్.. శివకుమార స్వామి గొప్ప మానవతావాది, ఆధ్యాత్మిక గురువని కొనియాడారు. ఆయన స్థాపించిన 132 విద్యాసంస్థల ద్వారా అన్ని వర్గాల పేదలకు ఉచిత విద్య, భోజనవసతి కల్పిస్తున్నారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని కోరారు. ఆయన సేవలను దివంగత నాటి రాష్ట్రపతి కలాం కొనియాడారని తెలిపారు.

1228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles