రాజ‌స్థాన్ సీఎం తీరుపై రాహుల్ ఆగ్ర‌హం !

Tue,May 28, 2019 10:45 AM

Trouble brews in Rajasthan Congress after Rahul Gandhi rebukes Chief Minister Ashok Gehlot

హైద‌రాబాద్: పార్టీ చీఫ్ ప‌ద‌విని వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డ్డ రాహుల్ గాంధీ.. రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ గెహ్లాట్ కేవ‌లం త‌న కుమారుడు వైభ‌వ్‌ ప్ర‌చారం కోస‌మే ప‌నిచేశార‌ని రాహుల్ సీరియ‌స్ అవుతున్నారు. రాజ‌స్థాన్‌లోని 25 లోక్‌స‌భ స్థానాల్లో కాంగ్రెస్ ఓట‌మిపాలైంది. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా అశోక్ గెహ్లాట్ ప్ర‌చారం చేప‌ట్ట‌కుండా.. కేవ‌లం కుమారుడి సీటుకే ప‌రిమితం కావ‌డం రాహుల్‌ను ఆవేశానికి గురి చేస్తున్న‌ది. లోక్‌స‌భ ప‌రాభ‌వాన్ని త‌ట్టుకోలేక కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ద‌మైన రాహుల్‌ను బుజ్జ‌గించేందుకు మ‌రోవైపు సీనియ‌ర్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో అశోక్ గెహ్లాట్ తీరుపై రాహుల్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. జోద్‌పూర్‌లో త‌న కుమారుడి ప్ర‌చారం కోస‌మే గెహ్లాట్ స‌మ‌యాన్ని వృధా చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు. రాహుల్ ఎంత అస‌హ‌నానికి గురైనా.. గెహ్లాట్ మాత్రం దానిపై పెద్ద‌గా స్పందించ‌లేదు.

2350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles