త్రివేండ్రం మేయర్‌పై ప్రతిపక్ష బీజేపీ నేత దాడి

Sat,November 18, 2017 05:19 PM

Trivandrum Corporation mayor injured in BJP councilors attack

కేరళ: త్రివేండ్రం కార్పొరేషన్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. అధికార ఎల్‌డీఎఫ్ కౌన్సిల్సర్లు, విపక్ష బీజేపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత గిరికుమార్ అతని అనుచరులు మేయర్ వి.కె. ప్రసంత్‌పై భౌతికదాడికి పాల్పడ్డారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం తిరిగి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. మేయర్ చొక్కాను సైతం చింపారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్లు మేయర్‌పై జరిగిన దాడిని అడ్డుకుని ఆయనను రక్షించారు. దాడిలో గాయపడ్డ మేయర్‌ను చికిత్స నిమిత్తం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్ రజియా బేగం కూడా గాయపడ్డారు. సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.
దాడికి గల కారణం..
తమ నిధుల నుంచి నగరంలో హై మాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడం మానివేయాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మేయర్ లేఖ రాశారు. కాగా మేయర్ చర్యను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మేయర్ స్పందిస్తూ కౌన్సిలర్లు మేయర్ చర్యలను ప్రశ్నించజాలరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం మేయర్ తిరిగి వెళ్తుండగా ప్రతిపక్ష నేత తన సహచరులతో కలిసి మేయర్‌పై భౌతికిదాడికి పాల్పడ్డాడు.934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS