ప్రత్యర్థిపై చేయి చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు.. వీడియో

Fri,April 19, 2019 11:20 AM

Tripura Congress Chief Slaps Man Who Attacked Sister Convoy

దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. త్రిపుర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రద్యోత్‌ దేవ్‌ బుర్మాన్‌.. ఐపీఎఫ్‌టీ కార్యకర్తపై పోలీసుల ఎదుటే చేయి చేసుకున్నాడు. బుర్మాన్‌ సోదరి ప్రగ్యా దేవ్‌ బుర్మాన్‌ ఈస్ట్‌ త్రిపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కోవాయ్‌ జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. ఓ గిరిజన గ్రామం వద్ద ప్రగ్యా దేవ్‌ కాన్వాయ్‌పై ఐపీఎఫ్‌టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ కేసులో పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఐపీఎఫ్‌టీ కార్యకర్తపై తన సహచరులతో వచ్చిన ప్రద్యోత్‌ దేవ్‌ అతనిపై చేయి చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles