పార్లమెంట్‌ వద్ద మిమీ చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌

Tue,May 28, 2019 06:17 PM

Trinamool MPs Mimi Chakraborty, Nusrat Jahan posing at Parliament


న్యూఢిల్లీ: బెంగాలీ నటీమణులు మిమీ చక్రవర్తి, సుస్రత్‌ జహాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ఇద్దరు లోక్‌సభకు వెళ్లనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనానికి వెళ్లిన మిమీ చక్రవర్తి, సుస్రత్‌ జహాన్‌ తమ పేర్లు నమోదు చేసుకుని, ఐడీ కార్డులు తీసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎదుట ఈ ఇద్దరు తమ ఐడీ కార్డులు మెడలో వేసుకుని ఫొటోలకు పోజిచ్చారు. మిమీ, నుస్రత్‌ ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో పార్లమెంట్‌కు రావడం గమనార్హం.

అయితే తొలిరోజే పార్లమెంట్‌కు ఇలాంటి దుస్తుల్లో రావడం పట్ల నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..కామెంట్లు పెట్టారు. ఇది సినిమా షూటింగ్‌ కాదని ఓ వ్యక్తి కామెంట్‌ పోస్ట్‌ చేయగా...ఇది ఫొటోషూట్‌ చేసే స్థలం కాదంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు.

1523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles