మమతకు మరో ఝులక్.. మరో ఎమ్మెల్యే జంప్

Wed,May 29, 2019 05:04 PM

Trinamool Congress MLA Manirul Islam joins Bharatiya Janata Party in Delhi.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి మరో గట్టి షాక్. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళవారం పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఒక టీఎంసీ ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లాం, ముగ్గురు టీఎంసీ నేతలు గదాధర్ హజ్రా, మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్, నిమాయ్ దాస్ ఢిల్లీలో బీజేపీలో చేరారు.

మంగళవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియ, ముకుల్‌రాయ్ సమక్షంలో సుభ్రాంగ్‌షురాయ్‌తోపాటు టీఎంసీకి చెందిన మరో ఎమ్మెల్యే తుషార్‌కాంతి భట్టాచార్య, సీపీఐ(ఎం) శాసనసభ్యుడు దేవేంద్రనాథ్‌రాయ్‌తోపాటు తృణమూల్‌కు చెందిన 50 మంది కౌన్సిలర్లు తమ పార్టీలో చేరారు.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles