ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Mon,August 20, 2018 11:53 AM

tributes to Rajiv Gandhi on birth anniversary

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 74వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజీవ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు మోదీ. రాజీవ్ దేశానికి అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంటాయని మోదీ ట్వీట్ చేశారు.

రాజ్‌ఘాట్‌లోని రాజీవ్ సమాధి వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాతో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. 1944, ఆగస్టు 20న రాజీవ్ జన్మించారు. 1991, మే 21న రాజీవ్ కన్నుమూశారు. 1984 నుంచి 1989 వరకు ప్రధానమంత్రిగా పని చేశారు రాజీవ్ గాంధీ.2070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles