గిరిజ‌నుల దాడి.. 20 మంది పోలీసుల‌కు గాయాలు

Wed,January 23, 2019 03:00 PM

tribals attack forest police in Maharastra, 20 men injured

మేల్‌ఘాట్: మ‌హారాష్ట్ర‌లో గిరిజ‌న‌లు ఉగ్ర‌రూపం దాల్చారు. అట‌వీశాఖ అధికారులు, పోలీసుల‌పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న అమ‌రావ‌తిలోని మేల్‌ఘాట్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌భుత్వం వాహ‌నాల‌ను, ఆస్తుల‌ను గిరిజ‌నులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో 45 మంది అట‌వీశాఖ సిబ్బందితో పాటు 20 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. వారంతా ఇప్పుడు హాస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవ‌ల మేల్‌ఘాట్‌కు చెందిన కొంద‌రు గిరిజ‌నుల‌కు అకోలాలో పున‌రావాసం క‌ల్పించారు. అయితే పున‌రావాసం క‌ల్పించిన వారికి పూర్తి ఏర్పాట్లు చేయ‌లేదు. దీంతో ఆ గిరిజ‌నులు అక్క‌డ నుంచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. వాళ్ల‌ను నివారించే క్ర‌మంలో ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది.

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles