మీరట్‌లో భూకంపం.. కంపించిన ఢిల్లీ

Mon,September 10, 2018 09:57 AM

Tremors In Delhi After Mild Earthquake in Uttar Pradesh's Meerut

ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం ఆరున్నర సమయంలో మీరట్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్ఖౌదాలో భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర స్కేల్‌పై తీవ్రత 3.6 గా నమోదయినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.

ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో గత 24 గంటల్లో రెండు సార్లు భూమి కంపించింది. నిన్న మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8 గా నమోదయింది. 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

1016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles