పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

Mon,July 17, 2017 03:20 PM

trains cancelled due to rains

భువనేశ్వర్ : ఒడిశాలోని సంబాల్‌పూర్ డివిజన్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తాయి. వరదల వల్ల పలు రైళ్లను రద్దు కాగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు, మరికొన్నింటిని దారి మళ్లింపు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సింగాపూర్ - తెరువలి మార్గంలో ప్రమాద స్థాయిని మించి వరద ప్రవాహం ఉంది. ఇవాళ్టి సంబాల్‌పూర్ - హెచ్.ఎస్.నాందేడ్ నాగావళి ఎక్స్‌ప్రెస్ రద్దు అయింది. రేపటి హెచ్.ఎస్.నాందేడ్ - సంబాల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రేపటి బిలాస్‌పూర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు అయింది. ఈ నెల 20న తిరుపతి - బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు అయింది. రాయగడ - జునాగఢ్ రోడ్ - రాయగడ మధ్య రైళ్ల సేవలు రద్దయ్యాయి. భువనేశ్వర్ - జునాగఢ్ రోడ్ లింక్ ఎక్స్‌ప్రెస్ రాయగడ వరకు మాత్రమే పరిమితం చేశారు. తిరుపతి - బిలాస్‌పూర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్, అలప్పుజా - ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్, నాందేడ్ - సంబాల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్, విశాఖ - ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను విజయనగరం మీదుగా మళ్లించారు. హజ్రత్ నిజాముద్దీన్ - విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ మీదుగా మళ్లించారు. ను విజయనగరం మీదుగా మళ్లించారు. విశాఖ - హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ 10 గంటలకు పైగా ఆలస్యం కానున్నది.

1295
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS