ఇంజిన్ లేకుండానే 10 కి.మీ. వెళ్లిన రైలు.. వీడియో

Sun,April 8, 2018 11:07 AM

Train Travels Without Engine For 10 Km in Odisha

భువనేశ్వర్ : రైలింజన్ లేకుండానే 22 బోగీల రైలు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ ఘటన ఒడిశాలోని టిట్లాగఢ్ - కేసింగా రైల్వేస్టేషన్ల మధ్య శనివారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ - పూరి ఎక్స్‌ప్రెస్‌కు టిట్లాగఢ్ స్టేషన్ వద్ద ఇంజిన్ అమర్చే క్రమంలో రైల్వే సిబ్బంది బ్రేకులు సరిగ్గా వేయలేదు. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడం కారణంగానే.. ఆ రైలు దానంతట అదే 10 కిలోమీటర్లు వెళ్లింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. కొంతమంది ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. కేసింగా వైపు వెళ్తున్న రైలును ఆపేందుకు.. పెద్ద రాళ్లను రైలు పట్టాలపై అమర్చారు. దీంతో రైలు ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. మళ్లీ రైలుకు ఇంజిన్ అమర్చి టిట్లాగఢ్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు రైల్వే ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.5758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles