నీళ్లలో రయ్ మంటూ దూసుకెళ్లిన ట్రెయిన్.. వైరల్ వీడియో

Sat,July 6, 2019 06:08 PM

train running on water video goes viral

ట్రెయిన్ పట్టాల మీద కదా నడిచేది.. నీళ్లలో ఎలా నడిచింది.. కొత్త టెక్నాలజీ ఏమైనా కనిపెట్టారా? ఏదేశంలో కనిపెట్టారు.. అని అంటూ ఆవేశపడకండి. ట్రెయిన్ నీళ్లలో నడిచింది వేరే దేశంలో కాదు. మన దేశంలోనే.. ఆర్థిక రాజధాని ముంబైలో. గత వారం రోజుల నుంచి ముంబైలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి తెలుసు కదా. భారీ వర్షాలకు ముంబై మునిగిపోయింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, షాపులు అన్నీ మూతపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది.

సాధారణంగా ముంబైలో జులై మాసంలో అత్యధిక వర్షాలు కురుస్తాయి. కానీ.. ఈసారి అత్యధికం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాక్స్ కూడా పూర్తిగా మునిగిపోయాయి. దీంతో కొన్ని రైల్వే సర్వీసులను సెంట్రల్, వెస్టర్న్ రైల్వే సంస్థలు ఆపివేసినప్పటికీ.. కొన్ని లోకల్ ట్రెయిన్స్ నడిచాయి.

ఆ సమయంలో తీసిన వీడియోనే ఇది. మొత్తం చెరువులా కనిపిస్తున్న నీళ్లలో నుంచి రయ్‌మంటూ దూసుకెళ్లింది. ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోయింది. అసలు ట్రాక్ కనిపించకున్నా.. నీటిలో వెళ్తున్న ట్రెయిన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


6996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles