రైలులో రూ.5.75 కోట్లు చోరీ.. కేసును చేధించిన పోలీసులు

Mon,August 27, 2018 01:31 PM

train robbery in Tamilnadu, CBCID cracks Salem case

చెన్నై: తమిళనాడులో ఓ రైలు నుంచి 5.75 కోట్ల నగదును దొంగలు లూటీ చేశారు. ఈ ఘటన 2016, ఆగస్టు 8న జరిగింది. ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు ఈ కేసును చేధించారు. లూటీకి పాల్పడిన దొంగల ముఠా వివరాలను పోలీసులు సేకరించారు. సేలమ్ నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ దొంగతనం జరిగింది. వాస్తవానికి ఆ రైలులో ఉన్న పార్సిల్ వ్యాన్‌లో మొత్తం 342 కోట్ల నగదు ఉన్నది. కానీ దొంగలు మాత్రం 5.75 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. రైలు పైన పార్సిల్ వ్యాన్ డబ్బాకు ఓ కన్నం వేసి మరీ చోరీకి పాల్పడ్డారు. సుమారు రెండున్నర ఫీట్ల మేరకు రైలు డబ్బాకు కన్నం వేశారు. సీబీఐ, సీఐడీ పోలీసులు ఈ ఘటనపై రెండేళ్లుగా కేసును చేధిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముఠా ఈ లూటీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆ ముఠా గతంలో అనేక పెద్దపెద్ద నేరాలకు పాల్పడింది. రైలు పార్సిల్ వ్యాన్ సమీపం నుంచి వాడిన మొబైల్ ఫోన్ల ఆధారంగా కేసును పోలీసులు చేధించారు. రైల్వే స్టేషన్లతో పాటు హైవేపై ఆ రోజు వెళ్లిన వాహనాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని కోసం సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కదులుతున్న రైలుపై సుమారు నలుగురు లేదా అయిదుగురు ఎక్కి ఉంటారని, వాళ్లు ఆ కోచ్‌కు రంధ్రం చేసి, డబ్బును ఎత్తుకెళ్లారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దొంగల ముఠా గురించి మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అయితే ప్రస్తుతం ఆ ముఠా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

5696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles