ట్రైన్-18పై రాళ్లు విసిరిన ఆకతాయి.. పగిలిన అద్దం

Fri,December 21, 2018 08:00 AM

Train 18 was pelted with stones during trial run between Agra and New Delhi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల ట్రైన్-18 రైలుపై గురువారం ఓ ఆకతాయి రాళ్లు విసిరాడు. ఢిల్లీ-ఆగ్రా మధ్య గురువారం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 29న ఈ రైలును ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించారు. గంటకు 180 కి.మీ వేగంతో ట్రైన్ 18 ప్రయాణిస్తుండగా ఆకతాయి రాళ్లు విసరడంతో ఓ అద్దం పగిలిపోయింది. ఆ సమయంలో ఐసీఎఫ్ చీఫ్ డిజైన్ ఇంజనీర్ శ్రీనివాస్ క్యాబ్‌లో ఉన్నారు. నిందితుడిని పట్టుకుంటారని అనుకుంటున్నా అని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

2490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles