ఓటుకు నోటు కేసు.. ఫిబ్రవరిలో విచారణ

Fri,November 2, 2018 01:19 PM

trails on cash for vote case in supreme court

న్యూఢిల్లీ : తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని, కేసును త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2015, మే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు లంచాలు ఇచ్చారని కోర్టుకు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టుకు తెలిపాడు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ మదన్ బీ లోకూర్.. ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి - మార్చిలో ఎన్నికలు ఉంటాయని సిద్ధార్థ్ తెలిపాడు. ఆ విషయంలో తామేమి చేయలేమన్న జస్టిస్ మదన్ బి లోకూర్ స్పష్టం చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ.. రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

2746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles