ముంబై ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఘటన.. ట్రాఫిక్ సిగ్నలే ఆ వాహనదారులను కాపాడింది

Fri,March 15, 2019 04:58 PM

Traffic signal saves motorists just before Mumbai bridge collapse

నిన్న ముంబైలోని ఛత్రపతి శివాజి టర్మనస్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కూలిపోయిన సంగతి తెలిసిందే కదా. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 36 మంది దాకా గాయపడ్డారు. అయితే.. బ్రిడ్జి కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందే ఆ బ్రిడ్జికి కొంచెం దూరంలో ఉన్న చౌరస్తా దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ఆ బ్రిడ్జి కింది నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నీ సిగ్నల్ వద్ద ఆగిపోయాయి. అదే సమయంలో బ్రిడ్జి కూలిపోవడంతో వాహనదారులకు పెద్ద ముప్పు తగ్గింది. సిగ్నల్ పడటం కొన్ని క్షణాలు ఆలస్యమైనా.. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులంతా బ్రిడ్జి కింద నలిగిపోయేవారని స్థానికులు చెబుతున్నారు.

రెడ్ సిగ్నల్ పడగానే అసహనంగా వేచి చూస్తున్నా. గ్రీన్ సిగ్నల్ పడిందో లేదో.. ఇంతలోనే బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతే.. ఒక్క క్షణం ముందు గ్రీన్ సిగ్నల్ పడినా పరిస్థితి వేరే రకంగా ఉండేది.. అని ఓ వాహనదారుడు తెలిపాడు.

అది చాలా రష్ ఉంటే సమయం. ఎందుకంటే.. ఆఫీసుల నుంచి చాలామంది అప్పుడే ఇంటికి తిరిగి వెళ్తుంటారు. సీఎస్‌ఎంటీలో ఆ టైమ్‌లో చాలా రష్ ఉంటుంది. నేను కూడా ఇంటికి తొందరగా వెళ్లాలనుకున్నా. రెడ్ సిగ్నల్ పడటంతో గ్రీన్ కోసం ఎదురు చూస్తున్నా. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. లేకపోతే నేను కూడా ఆ ఘటనలో గాయపడేవాడిని.. అని మరో వాహనదారుడు తెలిపాడు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles