అమెరికా, చైనా కొట్టుకుంటే.. మనకే లాభం!

Fri,September 28, 2018 02:49 PM

Trade war between US and China will benefit India in the long run says Jaitly

న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఇండియాకు లాభం చేకూరుస్తుందని అన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రెండు అగ్ర రాజ్యాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం మొదట్లో కాస్త అస్థిరతకు దారి తీసినా.. ఇది ఇండియాకు సుదీర్ఘ కాలంలో మేలు చేస్తాయని అన్నారు. తయారీ, వాణిజ్య రంగాలకు భారత్ అడ్డాగా మారుతుందని ఆయన చెప్పారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో భాగంగా.. అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయన్నదానిపై మాట్లాడారు. కొన్ని అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై దారుణమైన ప్రభావాన్ని చూపినా, అవి తర్వాతి కాలంలో దేశ వేగవంతమైన వృద్ధికి ఉపకరిస్తాయని తెలిపారు. మనం చేయాల్సిందల్లా ఈ సవాలు మనకు ఎప్పుడు అవకాశంగా మారుతుందో వేచి చూడటమేనని జైట్లీ అన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా భారత్‌కు చెందిన మెషినరీ, ఎలక్ట్రికల్ పరికరాలు, వాహనాలు, కెమికల్స్, ప్లాస్టిక్స్, రబ్బర్ ఉత్పత్తులకు అమెరికాలో మంచి డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇక పెరిగి పోతున్న క్రూడ్ ఆయిల్ ధరలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతున్నాయని జైట్లీ అన్నారు. ఇండియా 81 శాతం చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో ఆ మేరకు ధరల పెంపు ప్రభావం దారుణంగా ఉంటున్నది. ప్రస్తుతం బ్యారెల్ ధర 80 డాలర్లను మించిపోయింది. ఐదు వారాల కిందట 71 డాలర్లుగా ఉన్న ఈ ధర భారీగా పెరగడంతో ఆ మేరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ సవాళ్లన్నీ మనకు రానున్న రోజుల్లో అవకాశాలుగా మారుతాయని జైట్లీ ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యాపారాలన్నీ నైతికంగా వ్యవహరిస్తూ, పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు.

3233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles