ఐదో విడుతలో 62.56 శాతం పోలింగ్ నమోదు

Mon,May 6, 2019 08:44 PM

Total voter turnout in Phase 5 of Lok Sabha Election 2019 62 percentage

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఐదో విడుత ఎన్నికలు జరిగాయి. ఏడు రాష్ర్టాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఐదో విడుతలో 62.56 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, స్మృతి ఇరానీ, జయంత్ సిన్హా, అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జమ్మూకశ్మీర్ పుల్వామాలోని ఓ పోలింగ్ కేంద్రంపై గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. వరుసగా మూడుసార్లు గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్జున్ సింగ్ వాహనంపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. మే 12న ఆరో విడుత ఎన్నికలు, మే 19న ఏడో విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు విడుతల్లో కలిపి 118 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని లోక్‌సభ స్థానాల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles