70 మంది డాక్టర్లు రాజీనామా

Fri,June 14, 2019 02:58 PM

Total 70 doctors have resigned over violence against doctors in the West Bengal

హైదరాబాద్‌ : పశ్చిమ బెంగాల్‌ డాక్టర్ల నిరసనకు మద్దతుగా పలువురు డాక్టర్లు రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాము విధి నిర్వహణలో కొనసాగలేమని, అందుకే తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి చెందిన 16 మంది డాక్టర్లు బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ రాజీనామా లేఖలను ఆరోగ్య శాఖకు సమర్పించారు. రాజీనామా చేసిన డాక్టర్లందరూ ప్రభుత్వానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు. వీరితో పాటు నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి చెందిన 27 మంది డాక్టర్లు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మొత్తంగా బెంగాల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 మంది డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆందోళన బాట పట్టారు.

2450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles