HomeLATEST NEWSTop IPS Probationers Gaush Alam and Richa Tomar share their experiences

రైతు బిడ్డగా గర్వపడుతున్నా : ఐపీఎస్ రీచా తోమర్

Published: Fri,August 23, 2019 03:53 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
70వ రెగ్యులర్ రిక్రూటీస్ బ్యాచ్‌కు చెందిన 92 మంది ఐపీఎస్ అధికారులు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో శనివారం ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరగనుంది. అయితే 92 మంది ఐపీఎస్‌లకు జరిగిన శిక్షణలో ఇద్దరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరిలో ఒకరు మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఒకరు మాజీ ఆర్మీ సుబేదార్ ఉద్యోగి కుమారుడు గౌస్ అలం కాగా, మరొకరు రైతు బిడ్డ రీచా తోమర్. ఎంతో కఠోరమైన శిక్షణలో టాపర్లుగా నిలవడం సంతోషంగా ఉందని గౌస్ అలం, రీచా తోమర్ చెప్పారు. గౌస్ అలం తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక కాగా, రీచా తోమర్ రాజస్థాన్ క్యాడర్‌కు ఎంపికైంది.

రైతు బిడ్డగా గర్వపడుతున్నా : రీచా తోమర్
ఐపీఎస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి టాప్‌లో నిలవడం సంతోషంగా ఉందన్నారు రీచా తోమర్. నా సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్ జిల్లాలోని హసన్‌పూర్ గ్రామం. మా నాన్న రైతు. మేము ఐదుగురం అక్కాచెల్లెళ్లం. ఒక తమ్ముడు ఉన్నాడు. బాగ్‌పాట్ జిల్లాలోనే తన విద్యాభ్యాసం పూర్తయింది. చదువంతా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే. బీఎస్సీలో టాపర్‌ను నేనే. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చేశాను. నెట్ జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించాను. పీహెచ్‌డీ కూడా చేశాను. నేను ఐపీఎస్ శిక్షణకు వచ్చే సమయంలో నాకు సంవత్సరం బాలుడు ఉన్నాడు. సీజేరియన్ కావడంతో.. శిక్షణలో తొలి మూడు నెలలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. శిక్షణ సమయంలో 10 కేజీల బరువుతో పాటు 5 కేజీల బరువున్న తుపాకీని భుజాన వేసుకొని 40 కిలోమీటర్లు వాకింగ్ చేసేదాన్ని. చిన్నప్పట్నుంచి వ్యవసాయ పనులు కూడా చేసేదాన్ని. కాబట్టి శిక్షణ సులువుగా అనిపించింది. సమాజంలో మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తాను అని రీచా తోమర్ చెప్పారు.

ఈ ట్రోఫీలు మా నాన్నకు అంకితం : గౌస్ అలం
ఉత్తమ ప్రతిభ కనబరిచిన గౌస్ అలంకు అనేక అవార్డులు వరించాయి. ప్రధానమంత్రి బ్యాటన్, హోం మినిస్ట్రీ రివాల్వర్ ట్రోఫీలు మా నాన్నకు అంకితం చేస్తున్నట్లు అలం ప్రకటించారు. నా సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని గయా. కానీ నాన్న మాజీ ఆర్మీ సుబేదార్. దీంతో ఢిల్లీలో స్థిరపడ్డాం. నా చిన్నతంలోనే నాన్న చనిపోయారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. సివిల్స్ సాధించి ఐపీఎస్ కావడం.. బ్యాచ్ టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది.

గౌస్‌అలంకు వచ్చిన ట్రోఫీలు
ప్రధామంత్రి బ్యాటన్, హోంమంత్రి రివాల్వర్, మణిపూర్ కప్ ఫర్ లా, ది కమాండెంట్ పీఎల్ మెహతా కప్, వైస్ ప్రెసిడెంట్ ట్రోఫీ, మెహతా కప్, బీఎస్‌ఎఫ్ ట్రోఫీ.
2606
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology