ఆయన పెద్ద లీడరేమీ కాదు.. బీజేపీలో చేరినా నష్టం లేదు!

Fri,March 15, 2019 03:34 PM

Tom Vadakkan is not a big leader says Rahul Gandhi

న్యూఢిల్లీ: టామ్ వడక్కన్.. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన నేత. సోనియాకు గతంలో కార్యదర్శిగానూ పని చేశారు. ఇప్పటికీ ఆమెకు చాలా సన్నిహితంగా ఉండే నేత. అలాంటి వ్యక్తి హఠాత్తుగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గురువారం బీజేపీలో చేరారు. అయితే ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. వడక్కనా..? లేదు, లేదు.. వడక్కన్ పెద్ద లీడరేమీ కాదు అని రాహుల్ అన్నారు. ఆయన పార్టీ మారడాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న రాహుల్.. తాను ప్రధానంగా మూడు అంశాలపై బీజేపీని టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. అన్నింటికన్నా పెద్ద సమస్య నిరుద్యోగం. ఇందులో మోదీ విఫలమయ్యారు. ఇక రెండోది అవినీతి. మీకు రాఫెల్ గురించి తెలిసే ఉంటుంది. మూడోది రైతుల సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన టామ్ వడక్కన్.. తాను బరువైన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ సమగ్రతను అనుమానించేలా కాంగ్రెస్ మాట్లాడటం తనను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు వడక్కన్ చెప్పారు.

2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles