టోల్ ప్లాజాలో ప‌ది ల‌క్ష‌లు లూటీ

Thu,June 8, 2017 11:24 AM

Toll Plaza vandalized in Mandsaur, 10 lakhs looted

మంద‌సౌర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద‌సౌర్ జిల్లాలో ఉన్న టోల్ ప్లాజాను లూటీ చేశారు. టోల్ ప్లాజా నుంచి సుమారు ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దును ఎత్తికెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. మంద‌సౌర్ జిల్లాలో గ‌త ఏడు రోజులుగా రైతులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. టోల్ ప్లాజాను ధ్వంసం చేసిన నిర‌స‌న‌కారులు అక్క‌డున్న ఫ‌ర్నీచ‌ర్‌కు నిప్పుపెట్టారు. మరోవైపు మంద‌సౌర్ జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఆ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. పోలీస్ ఫైరింగ్ వ‌ల్లే అయిదుగురు రైతులు మృతిచెందిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ద‌ర్యాప్తులో ఆ విష‌యం వెల్ల‌డైన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.




838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles