టోల్ ప్లాజా సిబ్బందిపై బీజేపీ ఎంపీ దాడి

Sat,October 6, 2018 11:45 AM

toll plaza employees critically injured after allegedly being thrashed by BJP MP Nandkumar Singh Chauhan

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని గునా - శివపురి రహదారిపై బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. టోల్ రుసుం చెల్లించాలని టోల్ ప్లాజా సిబ్బంది.. బీజేపీ ఎంపీ వాహనాన్ని ఆపారు. తాము ప్రజాప్రతినిధులమని చెప్పడంతో.. వారిని ఐడీ కార్డులను టోల్ ప్లాజా సిబ్బంది అడిగారు. మమ్మల్నే ఐడీ కార్డులు చూపించామని అడుగుతారా.. అంటూ టోల్ సిబ్బందిపై ఎంపీ నందకుమార్, ఆయన అనుచరులు, గన్‌మెన్లు దాడి చేశారు. వాకీటాకీలను ధ్వంసం చేసి.. అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

1383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles