హైనా బారినపడి రెండేళ్ల చిన్నారి మృతి

Tue,May 3, 2016 05:40 PM

Toddler mauled to death by hyena

ఉత్తరప్రదేశ్: హైనా బారినపడి రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన యూపీలోని కాన్పూరులో చోటుచేసుకుంది. సిటీ శివారులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ పరిసరాల్లో అడుకుంటోన్న చిన్నారిని సమీప అడవిలో నుంచి వచ్చిన హైనా ఎత్తుకెళ్లింది. అపార్ట్‌మెంట్ ప్రహారీ గోడకు ఉన్న రంద్రం గుండా హైనాలోనికి ప్రవేశించి చిన్నారిని నోట కరుచుకుని పరుగెత్తింది. దీనిని గమనించిన స్థానికులు కర్రలతో హైనాను వెంబడించారు. సుమారు అర కిలోమీటర్ వరకు చిన్నారిని నోట కరుచుకుని పరుగెత్తిన హైనా స్థానికులు తరమడంతో చిన్నారిని వదిలి అడవిలోకి పారిపోయింది. చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

1878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles