ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సిద్దరామయ్య

Sat,May 19, 2018 06:24 PM

today is historical day says siddaramaiah

బెంగళూరు: ఇవాళ చరిత్రాత్మకమైన రోజని సిద్దరామయ్య అన్నారు. బలపరీక్షకు ముందే కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సిద్దూ... ఈ విజయం రాజ్యాంగం సాధించిన విజయమన్నారు.

"విశ్వాస పరీక్షను ఎదుర్కొనే సంఖ్యాబలం యడ్యూరప్పకు లేదు. ప్రధాన మోదీ, అమిత్‌షా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చారు. బలనిరూపణకు ఒప్పుకొని అసమర్థుడిగా పరారవడం ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా గవర్నర్ వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ప్రజాతీర్పును అంగీకరించడం ప్రజాస్వామ్యవాదల కర్తవ్యం. బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతకరం. ఎమ్మెల్యేల కొనుగోలును గవర్నర్ ప్రోత్సహించారు.." అని సిద్దరామయ్య తెలిపారు.

2763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles