విగ్రహ ధ్వంసంపై టీఎంసీ స్టూడెంట్ వింగ్ నిరసన

Wed,May 15, 2019 02:39 PM

TMC student wing protests against the on Ishwar Chandra Vidyasagar statue vandalisation


కోల్‌కతా: కోల్‌కతాలో గుర్తు తెలియని దుండగులు ప్రముఖ విద్యావేత్త, ఫిలాంథ్రపిస్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని టీఎంసీ స్టూడెంట్ వింగ్ తీవ్రంగా ఖండించింది. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ స్టూడెంట్ వింగ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ..నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలియజేశారు.

మంగళవారం కోల్‌కతాలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రోడ్ షో నిర్వహించిన సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై కర్రలతో దాడి చేసుకోవడమే కాకుండా, రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో గుర్తు తెలియని వ్యక్తులు ఈశ్వర్ చంద్రవిద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles