మమతను చంపేస్తే రూ. కోటి ఇస్తాం

Mon,June 10, 2019 10:33 AM

TMC MP gets threat letter wanting to see Mamata Banerjee dead

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తే రూ. కోటి ఇస్తామని గుర్తు తెలియని వ్యక్తులు.. ఆరాంబాగ్ ఎంపీ అపరూప పొద్దార్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై పొద్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లేఖలో మార్ఫ్ చేసిన మమత ఫోటోను కూడా పంపారు. అయితే రాజ్‌వీర్ కిల్లా అనే వ్యక్తి లేఖ రాసినట్లు ఉంది. అతని మొబైల్ నంబర్ కూడా లేఖలో పొందుపరిచారు. బీధన్‌నగర్‌కు చెందిన రాజ్‌వీర్ కిల్లాను పోలీసులు సంప్రదించగా.. తన పేరును తప్పుగా అక్కడ వాడుకున్నారని, ఆ లేఖతో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు.

4091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles