బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లు

Tue,June 18, 2019 06:32 PM

TMC MLA Biswajit Das among 12 councillors joined bjp


న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ బొంగావ్ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ తోపాటు 12మంది టీఎంసీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రసన్ జిత్ ఘోష్ కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేతలు కైలాశ్ విజయవర్గీయ, ముకుల్ రాయ్ వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles